Thursday, June 9, 2011

చెక్కలు

కొంతమంది వీటినే పప్పు చెక్కలు అని కూడా అంటారు .. ఒక్కొక్క ఊర్లో ఒక్కో పేరు :) ఇవి చెయ్యటం కూడా సులువే..

కావలసినవి 

బియ్యపిండి 
అల్లం
పచ్చిమిర్చి
కర్వేపాకు
సెనగపప్పు 
బట్టర్ 
ఉప్పు 

ఇక చేసే విధానం 

సేనగాపపు ని కొంచం ముందుగ నానపెట్టుకోవాలి . అల్లం, కర్వేపాకు, పచ్చిమిర్చి మిక్షి లో వేసి బాగా మేతగా కాకుండా కొంచం పచ్చి పచ్చి గా చేసుకోవాలి . బియ్యపిండి లో తగినంత ఉప్పు అల్లం,పచ్చిమిర్చి పేస్టు , కొంచం బట్టర్ , నానపెట్టిన సెనగపప్పు వేసి అన్ని కలపాలి, చపతిలకి కలుపునట్లు కలుపుకోవాలి , చపాతీ పిండి కన్నా కొంచం పల్చగా చేసుకోవాలి . ఒక కవర్ మీద ఈ పిండిని అప్చుల్లగా చేసి నూనెలో వేసి ఎర్రగా వేఇంచుకోవాలి. 
కమ్మని చెక్కలు తినటానికి సిద్దం :) 

No comments:

Post a Comment