Thursday, June 9, 2011

చెక్కలు

కొంతమంది వీటినే పప్పు చెక్కలు అని కూడా అంటారు .. ఒక్కొక్క ఊర్లో ఒక్కో పేరు :) ఇవి చెయ్యటం కూడా సులువే..

కావలసినవి 

బియ్యపిండి 
అల్లం
పచ్చిమిర్చి
కర్వేపాకు
సెనగపప్పు 
బట్టర్ 
ఉప్పు 

ఇక చేసే విధానం 

సేనగాపపు ని కొంచం ముందుగ నానపెట్టుకోవాలి . అల్లం, కర్వేపాకు, పచ్చిమిర్చి మిక్షి లో వేసి బాగా మేతగా కాకుండా కొంచం పచ్చి పచ్చి గా చేసుకోవాలి . బియ్యపిండి లో తగినంత ఉప్పు అల్లం,పచ్చిమిర్చి పేస్టు , కొంచం బట్టర్ , నానపెట్టిన సెనగపప్పు వేసి అన్ని కలపాలి, చపతిలకి కలుపునట్లు కలుపుకోవాలి , చపాతీ పిండి కన్నా కొంచం పల్చగా చేసుకోవాలి . ఒక కవర్ మీద ఈ పిండిని అప్చుల్లగా చేసి నూనెలో వేసి ఎర్రగా వేఇంచుకోవాలి. 
కమ్మని చెక్కలు తినటానికి సిద్దం :) 

గారెలు

అన్దరూ గారెలు చెయ్యటమంటే అదేదో పెద్ద పిండి వంట అని చెయ్యటం చాల కష్టమని అనుకుంటారేమో .. నాకితే మనం తరచూ చేసుకునే పూరి కాన కూడా గార్లే తొందరగా చేసుకోవచు అని అనిపిస్తుడ్ని , ఎలా చెయ్యాలో చూసి ఒక సారి చేసుకుంటే మీకు కూడా అలానే అనిపిస్థున్దన్దొఇ.... 

మీకు కావాల్సిన పదార్ధాలు 

మినప్పప్పు 
సెనగపప్పు,
పచ్చిమిర్చి 
అల్లం,
కొతిమెర
ఉప్పు  
ఉల్లిపాయలు 


తాయారు చేసే విధానం 

మినపప్పు ఒక కప్ , సెనగపప్పు కొంచం ఒక గంట సేపు నానపెట్టి పెట్టుకోవాలి.  మినపప్పు ని మిక్షి లో వేసి బాగా మేతగా రుబ్బుకోవాలి , నీళ్ళు తక్కువ పొయ్యాలి . మిక్షి వేసే అపుడే కొన్ని పచిమేరపకాయలు , కొంచం అల్లం తగిన్నత ఉప్పు కూడా వేసుకోవాలి. ఒక అరగంట అల ఉంచాలి. ఉల్లిపాయలు, పొదిన, కొతిమెర  సన్నగా తరిగి ఆ పిండి ల కలిపుకోవాలి. ఒక షీట్ మీద ఈ పిండిని అప్చుల్లగా వేసుకొని అవి నూనెలో వేసి వేయించుకోవాలి . 

అంతే నోర్రోరించే వేడి వేడి గారెలు రెడీ ......